Online Puja Services

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి

3.138.110.119

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి | Yetla Ninnethukondunamma Varalakshmi Thalli | Lyrics in Telugu


ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… 
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… 
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

ఎట్లా నిన్నెత్తుకొందు… 
ఆట్లాడే బాలవు నీవు 

ఎట్లా నిన్నెత్తుకొందు… 
ఆట్లాడే బాలవు నీవు 

ఇట్లా రమ్మనుచు పిలిచి… 
కోట్లా ధనమిచ్చే తల్లి…

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… 
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

పసి బాలవైతే ఎత్తుకొందు… 
వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి 

పసి బాలవైతే ఎత్తుకొందు… 
వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి 

పూవులు పండ్లు తోరణములతో… 
పాలవెల్లి కట్టిన వేదికపై

పూవులు పండ్లు తోరణములతో… 
పాలవెల్లి కట్టిన వేదికపై

కలహంస నడకలతోటి… 
ఘల్లుఘల్లుమని నడిచే తల్లి

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… 
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

వేయి నామాల కల్పవల్లి… 
వేమారు మాపై కరుణించి సాయము ఉండు తల్లి… 

వేయి నామాల కల్పవల్లి… 
వేమారు మాపై కరుణించి సాయము ఉండు తల్లి… 

సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి 
సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి 

ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము 
సుఖము సంపదలిచ్చే తల్లి

ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము 
అయిదవతనమునిచ్చే తల్లి…

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… 
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

నవరత్నాల నీ నగుమోమె తల్లి… 
వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి… 

నవరత్నాల నీ నగుమోమె తల్లి… 
వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి… 

కుసుమ కోమల సౌందర్యరాశి… 
లోకపావని శ్రీ వరలక్ష్మీ… 

కుసుమ కోమల సౌందర్యరాశి… 
లోకపావని శ్రీ వరలక్ష్మీ… 

శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ… 
శుక్రవారము జగతిలో వెలిగే తల్లి 

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… 
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

ఎట్లా నిన్నెత్తుకొందు… 
ఆట్లాడే బాలవు నీవు 

ఇట్లా రమ్మనుచు పిలిచి… కోట్లా ధనమిచ్చే తల్లి…

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మీ తల్లి… 
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ

 

 


Sravana, Varalakshmi, Lakshmi, Song, Mahalakshmi, Shravana,

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda